విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన రోజు హెలికాప్టర్లో ప్లేస్ లేకపోవడం వల్ల తాను కారు దిగిపోయానని వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. సంఘటన దృష్ట్యా ఆరోగ్యశాఖ మంత్రి అక్కడకు వెళితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో తాను వెనక్కి తగ్గానని వివరించారు. దానిపై కొందరు అనవసరంగా రాధ్దాంతం చేస్తున్నారని విమర్శించారు. విశాఖ అనేది నేను దత్తత తీసుకున్న జిల్లా అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ క్లిష్టసమయాల్లో ప్రజలను ఆదుకునేందుకు తాను కచ్చితంగా ముందుంటానని స్పష్టం చేశారు.
గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాలకు ప్రజలు వచ్చేశారని ఆయన తెలిపారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్‌కు చెందిన 13 వేల టన్నుల స్టైరిన్లో 8 వేల టన్నులు ఈ రోజు వెళ్లిపోతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. మిగిలిన ఐదువేలు కూడా తరలించడం జరుగుతుందని అన్నారు. ఇక్కడున్న వాతావరణంలో ఎటువంటి రసాయనాలు లేవు అని నిర్ధారణ చేసుకున్నాకనే ప్రజలను ఇక్కడకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. మెడికల్ క్యాంప్,ఫుడ్స్ క్యాంప్‌లను కూడా నిర్వహిస్తామని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.