విజయసాయిరెడ్డితో కేశినేని నాని.. ఏం చర్చించారు?

ఉప్పు, నిప్పులా ఉండే ఇద్దరు నేతలు ఏం చర్చించి ఉంటారా? అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

news18-telugu
Updated: October 18, 2019, 9:56 PM IST
విజయసాయిరెడ్డితో కేశినేని నాని.. ఏం చర్చించారు?
విజయసాయిరెడ్డి, కేశినేని నాని
  • Share this:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటారు. అలాంటి నేతలు పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫొటో రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఈ ఫొటో ఎప్పుడు ఎవరు తీశారో గానీ.. దానికి సంబంధి ఓ ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లేందుకు ఇద్దరు ఎంపీలు విజయవాడ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ పరస్పరం ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా పక్కపక్కనే కూర్చున్నారు. ఈ అరుదైన సన్నివేశాన్ని అక్కడున్న కొందరు ఫొటోలు తీశారు. అయితే, ఫొటోలు వైరల్‌గా మారాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద విజయవాడ నుంచి గెలిచిన కేశినేని నాని, ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో వైసీపీ మీద ప్రత్యేకించి విజయసాయిరెడ్డి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి నేతలు కలవడం, పక్కపక్కనే కూర్చోవడంతో ఏం చర్చించి ఉంటారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

PICS : జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

Published by: Ashok Kumar Bonepalli
First published: October 18, 2019, 8:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading