పీఎంవో ఆఫీసులో విజయసాయిరెడ్డి... ఏం జరుగుతోంది ?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: August 23, 2019, 11:44 AM IST
పీఎంవో ఆఫీసులో విజయసాయిరెడ్డి... ఏం జరుగుతోంది ?
విజయసాయిరెడ్డి (File)
  • Share this:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి వెళ్లారు. ఉన్నట్టుండి ఈ ఇద్దరు ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీపీఏలపై సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ అంశంపై వీరిద్దరూ ప్రధాని కార్యాలయం అధికారులకు వివరణ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో తాము తీసుకుంటున్న నిర్ణయాలను ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నట్టు రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది.

దీనిపై వెంటనే అప్రమత్తమైన బీజేపీ నేతలు ఈ విషయాన్ని ప్రధాని సహా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ రకమైన ప్రచారం కారణంగా వైసీపీ నిర్ణయాలన్నింటికీ బీజేపీ మద్దతు ఉందనే సంకేతాలు వెళతాయని వారు తమ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి, అజయ్ కల్లాం ఇద్దరూ పీఎంవోలోని అధికారులను కలిసి పీపీఏలపై సమీక్ష, రివర్స్ టెండరింగ్ అంశాలపై వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు పోలవరం రివర్స్ టెండరింగ్‌ను నిలిపేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో... ఈ అంశంపై కూడా పీఎంవో అధికారులకు విజయసాయిరెడ్డి, అజయ్ కల్లాం వివరణ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.


First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>