ఉస్కో అంటే... పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: December 3, 2019, 12:36 PM IST
ఉస్కో అంటే... పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి... ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదులుతున్నాడని విమర్శించారు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదని సూచించారు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్... ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా ఆయనకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్యనేత ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. .


First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>