పవన్ కల్యాణ్‌ది యూటర్న్...వైసీపీ తీవ్ర విమర్శలు

గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని..కానీ వైసీపీపై అవనసర ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

news18-telugu
Updated: September 1, 2019, 1:16 PM IST
పవన్ కల్యాణ్‌ది యూటర్న్...వైసీపీ తీవ్ర విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
  • Share this:
ఏపీ రాజధాని అమరావతి విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని విషయంలో పవన్‌ది ద్వంద్వ వైఖరని ఆయన మండిపడ్డారు. అమరావతి అంశంలో ఆయన యూటర్న్ తీసుకున్నారని విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని..కానీ వైసీపీపై అవనసర ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి అనుకూలం కాదన్నారు. ఈ విషయాన్ని గతంలో పదే పదే చెప్పారు. ఇవాళ ఆయన యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు ఎలాగైతే యూటర్న్ తీసుకుంటారో పవన్ కూడా అలాగే యూటర్న్ తీసుకుంటున్నారు.
విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ
ఇటీవల అమరావతిలో పర్యటించిన పవన్ కల్యాణ్ రాజధాని మార్పు ఊహాగానాలపై మండిపడ్డారు. రాజధాని మార్చితే ఊరుకునే ప్రసక్తే లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయలో అవసరమైతే ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాను కలిసి ఇక్కడి పరిస్థితులను వివరిస్తానని స్పష్టంచేశారు.
Published by: Shiva Kumar Addula
First published: September 1, 2019, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading