ఆ పదవి ఊడగొట్టాలనుకుంటున్నారు... ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రఘురామకృష్ణంరాజు మరోసారి స్పష్టం చేశారు.

news18-telugu
Updated: July 16, 2020, 2:34 PM IST
ఆ పదవి  ఊడగొట్టాలనుకుంటున్నారు... ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు
రఘురామకృష్ణంరాజు
  • Share this:
తాను ఓ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా ఉండటం వల్లే సలహాల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. కొందరు తనకున్న ఈ పదవిని ఊడకొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని పదే పదే చెబుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడు పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షునికి గానీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు.

పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని, అయితే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగిందన్నారు. తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాలకు గురించి మాట్లాడానన్నారు. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన తర్వాతే తాను మాట్లాడానని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తానెప్పుడు పార్టీని విమర్శించలేదని అన్నారు. వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని రఘురామకృష్ణంరాజు స్పష్టంచేశారు.
Published by: Kishore Akkaladevi
First published: July 16, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading