మాట మార్చిన వైసీపీ ఎంపీ... మళ్లీ జగన్‌కు జేజేలు...

టీటీడీ భూములతో పాటు ఇసుక అంశంపై సొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన రఘురామకృష్ణంరాజు... తాజాగా సీఎం జగన్‌పై పెద్ద ఎత్తున పొడగ్తలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: June 6, 2020, 4:31 PM IST
మాట మార్చిన వైసీపీ ఎంపీ... మళ్లీ జగన్‌కు జేజేలు...
వైఎస్ జగన్, రఘురామ కృష్ణంరాజు (ఫైల్ ఫోటో)
  • Share this:
నరసాపురం వైపీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. ఇసుక కొరత సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆయన కొనియాడారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఇసుక సమస్యను ఇంత త్వరగా జగన్ నిర్ణయానికి జనం జేజేలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక వ్యవహారంలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై కూడా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని... వాటిని ప్రజలు ఎదుర్కొనే సమస్యలుగానే భావించాలని ఆయన సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే వైపీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌పై పొడగ్తలు కురిపించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేంద్రంలో బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉండే ఆయన... తాను బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటే తప్పేంటని అనేకసార్లు బహిరంగంగానే కామెంట్ చేశారు. టీటీడీ భూములతో పాటు ఇసుక అంశంపై సొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన రఘురామకృష్ణంరాజు... తాజాగా సీఎం జగన్‌పై పెద్ద ఎత్తున పొడగ్తలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వైసీపీ నాయకత్వంతో పెరిగిన గ్యాప్‌ను తగ్గించుకునేందుకే ఆయన ఈ రకంగా చేశారా అనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఇసుకపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన రఘురామకృష్టంరాజు... ఇకపై కూడా తాను ప్రజాసమస్యలను ఇదే రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని అనడం గమనార్హం.
Published by: Kishore Akkaladevi
First published: June 6, 2020, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading