వైసీపీ దూకుడు... ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో కీలక నిర్ణయం

తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: July 3, 2020, 10:01 AM IST
వైసీపీ దూకుడు... ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో కీలక నిర్ణయం
రఘురామకృష్ణంరాజు(Image: Facebook)
  • Share this:
తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు వచ్చాయని ఆయన వివరించారు. యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైనందున ఈ పేరు మీద షోకాజ్ నోటీస్ ఇవ్వలేదన్నారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్టు... సోమవారం ఈ కేసు విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంతకుముందు వైసీపీ ఎంపీలతో పాటు కొందరు న్యాయవాదులు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర పెద్దలను కలవబోతున్నట్టు వచ్చిన వార్తలపై కూడా రఘురామకృష్ణంరాజు స్పందించారు. వారి ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇన్నాళ్లు సీఎం జగన్‌కు తెలియకుండా నడుస్తోందని భావించానని, ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎంపీలు, న్యాయవాదులను పంపిస్తున్నారంటే.. సీఎం కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే.. పార్లమెంట్‌లో ఎవరూ ఉండబోరన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భూములు అమ్మొద్దని చెప్పానని, సీఎం జగన్ కూడా ఆ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇసుక, పేదలందరికీ ఇళ్లు పథకంలో ఉన్న తప్పులను మాత్రమే తాను ప్రస్తావించానన్నారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నర్సాపరం ఎంపీ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానికి లేఖ రాశారు. దూరదృష్టితో తీసుకున్న పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని ఆకాంక్షించారు. మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు లేఖలో కొనియాడారు.




First published: July 3, 2020, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading