వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్టంరాజు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ నివాసంలో విందు ఏర్పాటు చేయనున్నారు. దీనికి కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాను ఆయన ఆహ్వానించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు... తాను ఇస్తున్న విందును కాంగ్రెస్ ఎంపీ కేవీపీ నివాసంలో ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. కేవీపీ తన వియ్యంకుడు కావడం, ఢిల్లీలో తనకు ఇంకా బంగళా కేటాయించకపోవడమే దీనికి కారణమని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు అమిత్ షాను ఆహ్వానించేందుకు రఘురామకృష్ణంరాజు ఆయన దగ్గరకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఓ పరిణామం వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వేచి చూస్తుండగా... ఆ తర్వాత వచ్చిన రఘురామ రాజుకు తొలుత పిలుపు అందింనట్టు తెలుస్తోంది. ఢిల్లీకి వస్తున్న సీఎం జగన్‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా కోరేందుకు విజయసాయి, మిథున్ హోంమంత్రి చాంబర్‌కు వచ్చారు. ఆ తర్వాత... ఈనెల 11వ తేదీన తాను ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానించేందుకు రఘు అక్కడికి వచ్చి.. సిబ్బంది ద్వారా తన కార్డును లోపలికి పంపించారు. ఆశ్చర్యంగా... అమిత్‌షా నుంచి ఆయనకే తొలుత పిలుపు అందింది. ఆ తర్వాత అమిత్‌షా వద్దకు విజయసాయి, మిథున్ రెడి వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.