సింహం సింగిల్‌గా వస్తుంది.. వైసీపీ నేతలపై ఆ పార్టీ ఎంపీ రఘురామ ఫైర్

రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పశ్చిమ గోదావరికి చెందిన ఎమ్మెల్యేలంతా ఆయనపై మండిపడ్డారు. స్వచ్ఛందంగా ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి తనను విమర్శించిన వారిపై విరుచుకుపడ్డారు రఘురామ కృష్ణంరాజు.

 • Share this:
  వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై రచ్చ కొనసాగుతోంది. పశ్చిమ గోదావరికి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన అంత పోటుగాడైతే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేల విమర్శలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే తానూ కూడా చేస్తానని ప్రతి సవాల్‌ విసిరారు నర్సాపురం ఎంపీ.

  నా బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలి. జగన్‌ బొమ్మ పెట్టుకొని గెలిచి చూపించాలి. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక దొంగ‌. ఇళ్ల స్థలాల్లోనూ కోట్లు దండుకున్నారు. సత్యనారాయణ అరాచకాల గురించి అందరికీ తెలుసు. ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ రావు సీఎం అపాయింట్‌మెంట్‌ దొరక్క బాధపడ్డారు. సీఎం జగన్‌ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే చెప్పా. అందుకే నన్ను ఎయిర్‌పోర్టులో కలిశారు. పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.
  రఘురామ కృష్ణం రాజు


  సోమవారం కూడా రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసలు తాను వైసీపీలో చేరాలని అనుకోలేదని.. ఆ పార్టీ నేతలు కాళ్లా వేళ్లా పడి బతిమిలాడడం వల్లే వైసీపీలో చేరానని చెప్పారు. జగన్ పలు మార్లు ఫోన్ చేసి వైసీపీలో చేరాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని తెలిపారు. తాను కాకుండా నర్సాపురంలో ఇంకెవరు పోటీ చేసినా ఓడిపోయేవారని రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీతో పాటు కేడర్ నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరికి చెందిన ఎమ్మెల్యేలంతా ఆయనపై మండిపడ్డారు. స్వచ్ఛందంగా ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి తనను విమర్శించిన వారిపై విరుచుకుపడ్డారు రఘురామ కృష్ణంరాజు.
  Published by:Shiva Kumar Addula
  First published: