Home /News /politics /

సీఎం జగన్‌కు షాక్.. ఆదేశాలను బేఖాతరు చేసిన ఎంపీ

సీఎం జగన్‌కు షాక్.. ఆదేశాలను బేఖాతరు చేసిన ఎంపీ

సీఎం జగన్

సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు బేఖాతరు చేశారు. ప్రధాని మోదీతో విడిగా ఎవరూ కలవొద్దని జగన్ సూచించినా ఆయన పట్టించుకోలేదు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు బేఖాతరు చేశారు. ప్రధాని మోదీతో విడిగా ఎవరూ కలవొద్దని జగన్ సూచించినా ఆయన పట్టించుకోలేదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ ఎదురుపడటంతో రఘురామకృష్ణం రాజు ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భుజం తట్టిన మోదీ.. 'రాజు గారు' అంటూ సంబోధించినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొద్దిసేపు సంభాషణ జరిగినట్టు సమాచారం.

    కాగా, ఇటీవలే ఎంపీ రఘురామకృష్ణం రాజు 'ఇంగ్లీష్ మీడియం' వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నవేళ.. రఘురామకృష్ణం రాజు లోక్‌సభలో తెలుగు మీడియం గురించి మాట్లాడటం వివాదాస్పదమైంది. అయితే తాను తెలుగు భాషకు మద్దతునివ్వడం ఇంగ్లీష్ భాషను వ్యతిరేకించడంగా ఎలా చూస్తారని ప్రశ్నించారు. తెలుగుభాష,ఇంగ్లీష్ మీడియం రెండు వేర్వేరు అంశాలని రఘురామకృష్ణం రాజు వివరణ ఇచ్చుకున్నారు. ఇంతలోనే రఘురామకృష్ణం రాజు మరో వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం. మోదీని ఎంపీ కలవడంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, MP raghurama krishnam raju, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు