Home /News /politics /

YSRCP MP RAGHURAM KRISHNAM RAJU REACTIONS ON BJP MP SUJANA CHOWDARY COMMENTS SB

వైసీపీలోకి బీజేపీ ఎంపీ... జగన్ పార్టీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ జగన్,సుజనా చౌదరి

వైఎస్ జగన్,సుజనా చౌదరి

మరో 25 సంవత్సరాలు జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలన ఉంటుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇంత మంచి సీఎం ఉండగా.. నేతలెవరూ పార్టీ మారతారని అనుకోవడంలేదన్నారు.

    గత రెండు రోజులుగా ఏపీలో వైసీపీ, బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ ఎంపీలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా ఆయనకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలెవరూ పార్టీ మారే ఆలోచన చేయడం లేదన్నారాయన. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సుజనాయే వైసీపీలోకి వచ్చే అవకాశముందని జోస్యం చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఎంపీలంతా టచ్‌లోనే ఉంటారని వ్యాఖ్యానించారు. సుజనాతో ఎవరైనా టచ్‌లో ఉంటే వారి పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన్ను ఎప్పుడు కలిశారో చెప్పాలన్నారు. మరో 25 సంవత్సరాలు జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలన ఉంటుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇంత మంచి సీఎం ఉండగా.. నేతలెవరూ పార్టీ మారతారని అనుకోవడంలేదన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి అనుమతిస్తే...సుజనా చౌదరే మా పార్టీలోకి వచ్చేస్తారనుకుంటానన్నారు రఘురామకృష్ణరాజు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Bjp, MP raghurama krishnam raju, Sujana Chowdary, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు