Home /News /politics /

వైసీపీలోకి సుజనా చౌదరి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీలోకి సుజనా చౌదరి.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పినట్టు రాజధాని విషయం కేంద్రం పరిధిలోని అంశం అనడం పార్టీ అభిప్రాయం కాదని ఏపీ బీజేపీ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పినట్టు రాజధాని విషయం కేంద్రం పరిధిలోని అంశం అనడం పార్టీ అభిప్రాయం కాదని ఏపీ బీజేపీ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.

ఎంపీలంతా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయనపై విరుచుకుపడ్డారు. వైసీపీలో ఏ ఒక్కరూ పార్టీ మారడం లేదని.. సుజనాకు దమ్ముంటే బీజేేపీతో టచ్‌లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు.

    ఏపీలో 20 మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న సుజనా చౌదరి వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. సుజనా వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంపీలంతా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయనపై విరుచుకుపడ్డారు. వైసీపీలో ఏ ఒక్కరూ పార్టీ మారడం లేదని.. సుజనాకు దమ్ముంటే బీజేేపీతో టచ్‌లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. వైసీపీ ఎంపీలెవరూ బీజేపీలో చేరబోరని.. సుజనా చౌదరే వైసీపీలో చేరే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    మా ఎంపీలెవరు బీజేపీతో టచ్‌లో లేరు. తనతో టచ్‌లో ఉన్న వైసీపీ నేతలు ఎవరో సుజనా చౌదరి చెప్పాలి. నియోజకవర్గ సమస్యలపై ప్రధానిని కలిసి బీజేపీతో టచ్‌లో ఉన్నట్లా. ఇలాంటి ప్రచారంతో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. 25 ఏళ్ల పాటు జగన్ పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి మంచి సీఎం ఉండగానేతలెవరూ పార్టీ మారతారని అనుకోవడం లేదు. జగన్ అనుమతిస్తే సుజనా చౌదరే వైసీపీలోకి వస్తారని అనుకుంటున్నా.
    రఘురామ కృష్ణం రాజు, ఎంపీ
    కాగా, ఇటీవల ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. లోక్‌సభలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడారని.. ఆయన తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. ఆ మరుసటి రోజే పార్లమెంట్‌లో ప్రధాని మోదీని ఆయన కలవడంతో మరిన్ని ఊహాగానాలు వినిపించాయి. ఆయన బీజేపీ గూటికి వెళ్తారని పుకార్లు షికార్లు చేశాయి. దానిపై స్పందించిన రఘురామ కృష్ణం రాజు.. బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం జగన్‌ను దీనిపై వివరణ కూడా ఇచ్చారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: AP News, Bjp, MP raghurama krishnam raju, Sujana Chowdary, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు