జగన్‌కు మరో షాక్... కేంద్రమంత్రులకు వైసీపీ ఎంపీ విందు

మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా వస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

news18-telugu
Updated: December 11, 2019, 4:20 PM IST
జగన్‌కు మరో షాక్... కేంద్రమంత్రులకు వైసీపీ ఎంపీ విందు
సీఎం జగన్
  • Share this:
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు మరోసారి జగన్‌కు షాక్ ఇచ్చే పని చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన పార్లమెంట్ సభ్యులకు విందు ఇస్తున్నారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో వైసీపీ ఎంపీ ఈ విందును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని జన్‌పథ్, లాన్స్ ఆఫ్ వెస్టర్న్ కోర్టులోని ఆయన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఈ విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి మొత్తం 300 మంది ఎంపీలు హాజరవుతారని రఘురామకృష్ణంరాజు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.



మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా వస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వారిని ఆహ్వానించలేదని, కేవలం కొందరు కేంద్రమంత్రులు మాత్రం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఈ క్రమంలోనే రఘరామకృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు గాను పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజును, ఆయన సోదరులు నరసింహరాజు, రామరాజులను జగన్ వైసీపీలో చేర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


రఘురామ వ్యవహారంతో ఇప్పటికే మండిపడుతున్న జగన్ ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో పాటు.. తాను హెచ్చరించినప్పటికీ ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రుల్ని కలుస్తుండటంతో జగన్ మరోసారి ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి వైసీీపీ ఎంపీ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.
First published: December 11, 2019, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading