ఇంగ్లీష్ మీడియం వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు క్లారిటీ
తన ప్రసంగంలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు రఘురామ కృష్ణంరాజు. తాను తెలుగు అకాడమీకి ఇవ్వాల్సిన నిధుల గురించే మాట్లాడానని.. ఇంగ్లీష్ అనే పదాన్ని ఎక్కడా వాడలేదని తెలిపారు.
news18-telugu
Updated: November 19, 2019, 10:41 PM IST

రఘురామ కృష్ణం రాజు (ఫైల్)
- News18 Telugu
- Last Updated: November 19, 2019, 10:41 PM IST
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం విధానానికి పార్లమెంట్లో ఆయన వ్యతిరేకంగా మాట్లాడారన్న ప్రచారంపై దుమారం రేగుతోంది. ఎంపీ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఈ అంశంపై ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డితో చర్చించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంపై వివరణ ఇచ్చారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తన ప్రసంగంలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తాను తెలుగు అకాడమీకి ఇవ్వాల్సిన నిధుల గురించే మాట్లాడానని.. ఇంగ్లీష్ అనే పదాన్ని ఎక్కడా వాడలేదని తెలిపారు.
ప్రాచీన భాషల కోసం క్లాసికల్ లాంగువేజెస్ సెంటర్ మైసూర్లో ఉంది. అక్కడి నుంచి తెలుగును ఏపీకి మారుస్తున్నారా? అన్న ప్రశ్నపై చర్చ జరిగింది. ఆ సందర్భంగా కేశినేని నాని ఏపీలో తెలుగు మీడియాన్ని పక్కన బెడుతున్నారని అన్నారు. దానిపై నేను స్పందించి.. చంద్రబాబు హయాంలో తెలుగు భాష కోసం ఏమీ చేయలేదు. ఐదేళ్లలో తెలుగు అకాడమీయే లేదు.. జగన్ సీఎం అయ్యాక తెలుగు అకాడమీని పునరుద్దరించి లక్ష్మీపార్వతి ఛైర్‌పర్సన్‌గా నియమించారు. విభజన చట్టం సెక్షన్-10 ప్రకారం ఆస్తుల విభజన జరగలేదని.. అలాజరిగితే రూ.200 కోట్లు వస్తాయి. భాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆర్టికల్ 350, 350-Aలో ఉందని.. మీరు బాధ్యత తీసుకొని తెలుగు అకాడమీకి నిధులను త్వరగా ఇప్పించాలని మాత్రమే చెప్పా.
ఓ మీడియా ఛానెల్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన ఈ వివరణ ఇచ్చారు. తెలుగు భాషకు సపోర్ట్‌గా మాట్లాడాను తప్ప.. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు ఎంపీ. తెలుగు భాష, ఇంగ్లీష్ మీడియం వేర్వేరు అంశాలని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. తెలుగులో చాలా పుస్తకాలు చదివానని..తెలుగు భాషంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. లోక్ సభలో ప్రసంగంపై తను ఎవరూ సంజాయిషీ అడగలేదని.. మీడియాలో వార్తలు చూసే స్పందిస్తున్నానని తెలిపారు. సంజాయిషీ అడిగితే పార్టీ అధిష్టానానికి వివరణ ఇస్తానని స్పష్టం చేశారు నర్సాపురం ఎంపీ.

— రఘురామ కృష్ణంరాజు