వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే కొందరు నేతలు కొన్ని రకాల ‘డ్రగ్స్’ వాడుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. రఘురామకృష్ణం రాజు ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే, రఘురామకృష్ణంరాజు హార్ట్ ఆపరేషన్ మీద వైసీపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా విభాగం ట్రోల్ చేసిందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుండడంపై రఘురామ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన జగన్కు దగ్గరగా ఉండే నేతలు ‘డ్రగ్స్’ వాడుతున్నట్టు ఆరోపించారు. వైఎస్ జగన్కు దగ్గరగా ఉండే వైసీపీ నేతలు మానసిక జబ్బుల కోసం ‘సైకోట్రోపిక్ డ్రగ్స్’ వాడుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి తన దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయని ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుమతిస్తే వారి పేర్లు బయటపెడుతానని చెప్పారు.
పరిటాల రవి కుటుంబం ఆశలపై నీళ్లు చల్లిన సీఎం జగన్
Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?
Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పథకంలో డబ్బులు పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం
‘కొంతమంది వైసీపీ సోషల్ మీడియా వాళ్లు నా మీద చీప్ పబ్లిసిటీ చేశారు. నేను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యానని క్రూరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వారికి ఇదే నా వినమ్రమైన కౌంటర్ ఏంటంటే, మీ అందరి ప్రార్థనల వల్ల నేను హ్యాపీగా ఉన్నా. కోలుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు అమరావతి ఉద్యమం మొదలు పెట్టి మరో రెండు రోజుల్లో ఏడాది పూర్తవుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి రాజధానికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించడాన్ని రఘురామకృష్ణంరాజు స్వాగతించారు. ప్రధాని మోదీ పేరు చెప్పి ఆయన మనిషిగా తాను ఈ మాట చెబుతున్నాననడం ఇక్కడ గుర్తించాల్సిన అంశమన్నారు. అమరావతి ఉద్యమం 365 రోజులు గడిచే సమయానికి బీజేపీ రాష్ట్ర విభాగం మొత్తం పోరాటంలో భాగస్వామ్యం అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘అమరావతే రాజధాని అనే మన కలం త్వరలోనే నిజం కాబోతోంది.’ అని రఘురామకృష్ణంరాజు కామెంట్ చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 14, 2020, 20:35 IST