నన్ను చంపే ప్రయత్నం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

అమరావతిలో తనను చంపే ప్రయత్నం జరిగిందని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పన్నిన పన్నాగం ప్రకారమే తనపై దాడి జరిగిందని, మహిళా జేఏసీ ముసుగులో టీడీపీ మహిళలే తనపై దాడి చేశారని ఆరోపించారు.

news18-telugu
Updated: February 24, 2020, 4:47 PM IST
నన్ను చంపే ప్రయత్నం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
వైసీపీ ఎంపీ నందిగం సురేష్
  • Share this:
అమరావతిలో తనను చంపే ప్రయత్నం జరిగిందని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పన్నిన పన్నాగం ప్రకారమే తనపై దాడి జరిగిందని, మహిళా జేఏసీ ముసుగులో టీడీపీ మహిళలే తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఎంపీ.. టీడీపీలో క్రియాశీలకంగా పని చేసినవాళ్లే తనపై దాడి చేసేందుకు వచ్చారని అన్నారు. చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం మాత్రమే అధికారంలో ఉండాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇలాంటి దాడులు చేయిస్తున్నారని.. దీనికి కారణమైన చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు వెట్టి చాకిరీ చేయాలనే భావనలో చంద్రబాబు ఉన్నారని, సిట్ విచారణలో అక్రమాలు, అవినీతి బయట పడుతుందనే భయంతోనే ఆయన ఇదంతా చేస్తున్నారని టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగారు.

దాడి చేసే క్రమంలో తన గన్‌మెన్లపై కారం చల్లారని, తన వద్ద పనిచేసే వ్యక్తిని కొట్టారని సురేష్ ఆరోపించారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబుది నీచ సంస్కృతి అని, మానవత్వం లేని దుర్మార్గాలకు పాల్పడేవాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పుతో కొట్టినా కూడా సిగ్గు లేకుండా ఇలాంటి దాడులకు పురిగొల్పుతున్నాడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 24, 2020, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading