ఏపీ సీఈవోతో వైసీపీ ఎంపీ రహస్య భేటీ... రాజకీయవర్గాల్లో చర్చ

ఏపీ సీఈవో గోపల్ ద్విదేవీ (File)

ఆపై గంట తరువాత బయటకు వచ్చిన మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఏకాంతంగా ద్వివేదితో ఎంపీ మాట్లాడారు. అయితే సీఈవోతో ఆయన ఏం చర్చించారన్న విషయాలేవీ బయటకు రాలేదు. పార్టీ నేత తలసిల రఘురామ్‌‌తో కలిసి సచివాలయంలోని ద్వివేది కార్యాలయానికి మిథున్ రెడ్డి వెళ్లారు. అయితే రఘురామ్‌నులోనికి తీసుకెళ్లలేదని తెలుస్తోంది. ఆపై గంట తరువాత బయటకు వచ్చిన మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పలు పార్టీల నాయకులు సీఈఓ ద్వివేదితో చర్చలు జరిపారన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు తొలి దశలో మగిశాయి. ఓట్ల లెక్కింపునకు ఇంకా నాలుగు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో సీఈవోతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భేటీ జరగడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    అంతకుముందు కూడా పలువురు వైసీపీ నేతలు ద్వివేదితో భేటీ అయ్యారు. ఏపీలో అరాచక పాలన నడుస్తుందని ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ఇప్పుడు తాజాగా సీఈవోతో మిథున్ రెడ్డి భేటీ అవ్వడం మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
    First published: