రాయలసీమకు జగన్ చేస్తున్నది తక్కువే... వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తాజాగా వైసీపీ ఎంపీ రాజధాని విషయంలో మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: February 9, 2020, 1:57 PM IST
రాయలసీమకు జగన్ చేస్తున్నది తక్కువే... వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై రోజుకో మలుపు తిరుగుతుంది. ఓవైపు అమరావతినే రాజధాని చేయాలంటూ... మూడు రాజధానులు వద్దంటూ రైతులు చేస్తున్న దీక్షలు 52వ రోజుకు చేరుకున్నాయి. అయితే తాజాగా వైసీపీ ఎంపీ రాజధాని విషయంలో మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌  సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు జగన్‌ చేస్తున్నది ఇంకా తక్కువేనని మాధవ్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తాను టీడీపీ ఎంపీలపై దాడి చేశానంటూ చేస్తున్న ప్రచారాన్ని గోరంట్ల ఖండించారు. లోక్‌సభలో కియాపై అసత్యాలను ప్రస్తావిస్తుంటే అడ్డుకున్నానని, అది తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే జగన్ ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని ప్రకటించారు. కొన్ని కార్యాలయాల్ని కూడా కర్నూలుకు తరలించారు. దీంతో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ గోరంట్ల రాజధాని రాయలసీమలోపెట్టాలని డిమాండ్ చేయడం పార్టీలో మరో హాట్ టాపిక్‌గా మారింది.

రాజధాని అంశంతో పాటు... కియా తరలిపోతుందన్న వార్తలపై కూడా ఎంపీ గోరంట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్‌ సంస్థ ద్వారా చంద్రబాబు సృష్టించి భంగపడ్డారని ఆరోపించారు. రాయిటర్స్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని ఎంపీ విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఇంకా దుర్బర పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని చంద్రబాబును కోరారు.

First published: February 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు