Home /News /politics /

YSRCP MP GORANTLA MADHAV GIVES BIG SHOCK TO YS JAGAN THAT TELUGU DESHAM PARTY SUPPORTER WON MADHAV NATIVE VILLAGE PANCHAYAT AS UNANIMOUS PRN

AP Panchayat Elections: జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎంపీ.. స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థికి మద్దతు

గోరంట్ల మాధవ్ (ఫైల్)

గోరంట్ల మాధవ్ (ఫైల్)

Andhra Pradesh: ఏపీలోని ఓ జిల్లాలో అధికార పార్టీ ఎంపీనే.. ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతివ్వాల్సి వచ్చింది. సొంతపార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాల్సిన చోట.. ప్రత్యర్థి పార్టీ మద్దతిచ్చిన వ్యక్తిని ఏకగ్రీవం చేశారు.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏకగ్రీవాల కోసం వైసీపీ ట్రై చేస్తుంటే.. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల గ్రామస్థాయిలో రెండు పార్టీల మద్దతుదారులు కలిసిపోయి ఏకగ్రీవాలు చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరికొన్ని చోట్ల బడానేతల సంప్రదింపులతో పొలిటికల్ సెటిల్మెంట్లు జరిగాయి. కానీ ఓ జిల్లాలో మాత్రం అధికార పార్టీ ఎంపీనే.. ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతివ్వాల్సి వచ్చింది. సొంతపార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాల్సిన చోట.. ప్రత్యర్థి పార్టీ మద్దతిచ్చిన వ్యక్తిని ఏకగ్రీవం చేశారు. కట్ చేస్తే సొంతపార్టీ నేతల నుంచి అసంతృప్తి సెగ తగులుతోంది.

    అనంతపురం జిల్లా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంగతి అందిరికీ తెలిసిందే. సీఐగా ఉన్నప్పుడు అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేస్తూ మీసం మెలేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఆయనకు ఇమేజ్ ఉంది. కానీ పంచాయతీ ఎన్నికల్లో ఆ ఫైర్ సొంత పార్టీకి ఉపయోగపడలేదు. సరికదా టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలపాల్సి వచ్చింది.

    గోరంట్ల మాధవ్ స్వగ్రమాం.. కర్నూలు జిల్లా రుద్రవరం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజానికి ఎంపీగారి స్వగ్రామంలో వైసీపీకి ఏకగ్రీవం అవ్వాలి కానీ.. టీడీపీకి పోటీ లేకుండా పోయింది. రుద్రవరం సర్పంచ్ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ దగ్గరి బంధువు ఎం.కే మధు టీడీపీ మద్దతుతో బరిలో దిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మధుకి మద్దతివ్వాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలను ఒప్పించి మరీ టీడీపీ ఏకగ్రీవానికి పరోక్షంగా సహకరించారు. ఐతే మాధవ్ తీరుపై వైసీపీ శ్రేణుళ్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. సొంతపార్టీని కాదని బంధువుకు మద్దతిచ్చారంటూ స్థానిక నేతలు, కార్యకర్తలు మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

    పంచాయతీ ఎన్నికల్లో 90శాతం పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని పార్టీ అధిష్టానం టార్గెట్ విధించింది. పోటీ తప్పని పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రస్థాయి నేతలు, మంత్రుల సొంతగ్రామాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. కానీ ఎంపీ స్వగ్రామంలో ఇలా జరగడం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పక్కజిల్లాలో ఎంపీగా గెలిచిన మాధవ్.. సొంతగ్రామంలో కాంప్రమైజ్ అవడం విడ్డూరంగానే ఉంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gorantla madhav, Gram Panchayat Elections, Hindupuram, Kurnool, Local body elections, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు