బాలయ్య 'బంట్రోతు' వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ కౌంటర్

అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ మధ్య దుమారం చెలరేగిన బంట్రోతు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. తాజాగా బాలయ్య వ్యాఖ్యలకు ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: June 15, 2019, 12:37 PM IST
బాలయ్య 'బంట్రోతు' వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ కౌంటర్
నందమూరి బాలకృష్ణ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 15, 2019, 12:37 PM IST
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఉద్దేశించి చేసిన బంట్రోతు వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. తాను చంద్రబాబుకు బంట్రోతు అయితే... మీరంతా సీఎం జగన్‌కు బంట్రోతులా అని అచ్చెన్నాయుడు సభలోనే వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. దీంతో సభలో దీనిపై పెద్ద దుమారమే గెలిచింది. ఇక ఈ కామెంట్స్‌పై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ... అధికార పార్టీ నేతలు అయినా, ప్రతిపక్ష పార్టీ నేతలు అయినా ప్రజలకు బంట్రోతులేననీ, ప్రజా సేవకులేనని వ్యాఖ్యానించారు. తాజాగా బాలయ్య వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు.
ట్విట్టర్ వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయిరెడ్డి... టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారని వ్యాఖ్యానించారు. మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతేనని ఎద్దేవా చేశారు. ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడనేనని విమర్శించారు. ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్’ వసూలు చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతు సంతానమే కదా అని వ్యాఖ్యానించారు. మరి... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వ్యాఖ్యలపై టీడీపీ స్పందిస్తుందేమో చూడాలి.


First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...