పార్టీలో ఎవరూ మిగలరు.. వైసీపీ ఎంపీ వీడియో వైరల్

గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ మిగలరని పప్పులో కాలేశారు తిరుపతి ఎంపీ. ఆయన వ్యాఖ్యలతో పక్కనే ఉన్న ఇతర వైసీపీ నేతలు షాక్ అయ్యారు. వెంటనే వారు సరిచేయడంతో ఎంపీ నాలుక కరచుకొని జరిగిన పొరపాటును తెలుసుకున్నారు.

news18-telugu
Updated: January 13, 2020, 6:00 PM IST
పార్టీలో ఎవరూ మిగలరు.. వైసీపీ ఎంపీ వీడియో వైరల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజకీయ నేతలు ఏదో మాట్లాడాలనుకుంటారు. కానీ మీడియా మైకుల ముందు ఇంకేదో మాట్లాడతారు. నాలుక మడత పడడంతో నోరుజారి పూర్తి విభిన్న పలుకులు పలుకుతారు. దాంతో వారు చెప్పదలచుకున్న దానికి పూర్తి వ్యతిరేకమైన భావం బయటకొస్తుంది. ఇలాంటి ఘటనలు ఎన్నికల ప్రచారంలో ఎక్కవగా జరుగుతుంటాయి. తాజాగా మూడు రాజధానులపై జరుగుతున్న కార్యక్రమంలో ఓ ఎంపీ తడబడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తడబడి సొంత పార్టీపైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ర్యాలీ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు.. వైసీపీలో చేరేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెబుతూ.. గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ మిగలరని పప్పులో కాలేశారు తిరుపతి ఎంపీ. ఆయన వ్యాఖ్యలతో పక్కనే ఉన్న ఇతర వైసీపీ నేతలు షాక్ అయ్యారు. వెంటనే వారు సరిచేయడంతో ఎంపీ నాలుక కరచుకొని జరిగిన పొరపాటును తెలుసుకున్నారు. తిరిగి వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. 'సీఎం జగన్ గేట్లు తెరిస్తే టీడీపీలో ఎవరూ మిగలరు' ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చెప్పదలచుకున్న మాటలు ఇవి. కానీ మీడియా ముందు తడబడిన ఆయన..గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ మిగలరని నోరుజారారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్
First published: January 13, 2020, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading