Andhra Bank: ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయొద్దు...వైసీపీ ఎంపీ లేఖ

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రా, యూనియన్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాల్సివస్తే...ఆ బ్యాంకుకు ఆంధ్రా బ్యాంక్ పేరుపెట్టాలని సూచించారు.

news18-telugu
Updated: August 31, 2019, 3:37 PM IST
Andhra Bank: ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేయొద్దు...వైసీపీ ఎంపీ లేఖ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్యాంకుల విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విలీనానికి వ్యతిరేకంగా చిన్న బ్యాంకుల ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు సైతం కేంద్రాన్ని విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లో ఒక్క బ్యాంకు ప్రధాన కార్యాలయం కూడా లేకుండా చేశారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి (వైసీపీ) కేంద్రానికి లేఖ రాశారు. యూనియన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంకు విలీనం ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు.


90 ఏళ్ల కింద పట్టాభిరామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకులతో విలీనం చేయొద్దని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై పునరాలోచించుకోవాలని లేఖలో కోరారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రా, యూనియన్, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాల్సివస్తే...ఆ బ్యాంకుకు ఆంధ్రా బ్యాంక్ పేరుపెట్టాలని సూచించారు. అంతేకాదు దాని ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు బాలశౌరి. దీనిపై త్వరలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, బ్యాంకింగ్ సెక్రటరీని కలుస్తామని చెప్పారు.


First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading