చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రేదేవి. పెయిడ్ ఆర్టిస్ట్ లతో మంత్రులను తిట్టించారని టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో భేటీ అయ్యారు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు జోగి రమేష్, సుధాకర్ బాబు, ఉండవల్లి శ్రీదేవి డీజేపీతో భేటీ అయ్యారు. సీఎం జగన్ కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్స్ చూస్తుంటే అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజేపీకి ఫిర్యాదు చేశారు. ఓడిపోయినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీరు మారలేదని విమర్శించారు ఎమ్మెల్యే జోగి రమేష్. చంద్రబాబు వికృత చేష్టలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. సీఎం జగన్‌ను ఏం చేయలేరన్నారు. ప్రజలు జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ కారణంగానే ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ లాంటి నేతలు మరణించారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. మహిళా ఎమ్మెల్యే అయిన తనపై దాడి చేశారని విమర్శించారామె. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో మంత్రులను తిట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీని సంక్షోభంలో నెట్టారన్నారు.
కేవలం 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని కొనియాడారు ఎమ్మెల్యే శ్రీదేవి. సీఎం జగన్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా టీడీపీకి విమర్శించడమే పని అంటూ మండిపడ్డారు. అసభ్య పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కుటుంబానికి కుటుంబానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు,లోకేష్ లు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు మరో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చంద్రబాబు,లోకేష్ లు కక్షపూరితంగా తాము నియమించుకున్న సిబ్బందితో జగన్ కుటుంబంపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చూడండి: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్ట్
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.