HOME »NEWS »POLITICS »ysrcp mla vs leader over flexis on the eve of ys jaganmohan reddy birth day ba

YS Jagan Birthday: ఇలాంటివి వద్దంటే, అవే సీఎం జగన్‌కు గిఫ్ట్ ఇస్తున్న నేతలు

YS Jagan Birthday: ఇలాంటివి వద్దంటే, అవే సీఎం జగన్‌కు గిఫ్ట్ ఇస్తున్న నేతలు
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా పార్టీ నేతలు అధినేతకు గిఫ్ట్‌లు ఇవ్వడానికి ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, కొందరు నేతల వల్ల జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారుతోంది.

 • Share this:
  డిసెంబర్ 21. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా పార్టీ నేతలు అధినేతకు గిఫ్ట్‌లు ఇవ్వడానికి ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, కొందరు నేతల వల్ల జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారుతోంది. వారు అత్యుత్సాహం వల్ల పార్టీలో నేతల మధ్య విబేధాలు బట్టబయలై జగన్‌కు తలనొప్పి తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా దర్శిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పార్టీ నేత బూచేపల్లి శివప్రసాద్ మధ్య వైరం తలెత్తింది. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. అది తాజాగామరో సారి బయటపడింది. డిసెంబర్ 21న జగన్ బర్త్ డే కావడంతో అందు కోసం ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేతలు శివప్రసాద్ వర్గం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టింది. ఆ ఫ్లెక్సీలు మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిందంటూ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గం వాటిని చించేసే ప్రయత్నం చేసింది. అలాగే, ఫ్లెక్సీల్లో పార్టీ ఎమ్మెల్యే పేరు, ఫొటో ఎందుకు వేయలేదంటూ గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి సర్దిచెప్పారు.

  పరిటాల రవి కుటుంబం ఆశలపై నీళ్లు చల్లిన సీఎం జగన్  ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

  Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

  ఈ వివాదం ఒక్క దర్శిలోనే కాదు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించిన అన్ని చోట్లా జరుగుతున్నాయని వైసీపీ నేతలే చెబుతున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వైరం కొనసాగుతోంది. అక్కడ కరణం బలరాం, ఆమంచి వర్గాలు కొట్టుకున్నాయి. వాడరేవులో ఆమంచి కృష్ణమోహన్ వర్గంపై కరణం బలరాం వర్గం దాడి చేసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో రెండు వర్గాల వారికి గాయాలు అయ్యాయి. కొందరికి తలపై గాయమైంది. మరికొందరికి చేతలు, కాళ్లకు దెబ్బలు తగిలాయి. మత్స్యకారుల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఎదుటే ఇరు వర్గాలు కొట్టుకున్నాయి.

  TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు

  ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి

  విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

  ఐల వల, బల్ల వలల వాడకంపై కొన్నాళ్లుగా ప్రకాశం జిల్లా వాడరేవు, కఠారిపాలెం గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. సముద్రంలోనూ, బయట ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో రెండు వలలతో వేటపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల పరస్పర దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు మాజీ మత్స్యశాఖ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ అయిన మోపిదేవి వెంకటరమణ చీరాల వెళ్లారు. ఈ సందర్భంగా కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య విబేధాలు బయటపడ్డాయి.

  ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..

  గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ

  మోదీ, జగన్ ‘ట్రెండ్ సెట్టర్స్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన లీడర్స్.. ర్యాంక్స్ ఎంతంటే

  మోపిదేవి వెంట ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం చీరాల ఐకాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఆమంచి వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి లోనికి రానివ్వకుండా కరణం బలరాం వర్గం అడ్డుకుంది. తమపై దాడి చేయించిన ఆమంచిని ఆస్పత్రికి తీసుకొస్తారంటూ వాడరేకు చెందిన మత్స్యకార మహిళలు మోపిదేవిని నిలదీశారు. ఈ సందర్భంగా వారిని శాంతింపజేసేందుకు మోపిదేవి ప్రయత్నించారు. అయినా వారు శాంతించలేదు. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగింది. ఇరు వర్గాల పరస్పరం దాడులు చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:December 14, 2020, 14:33 IST