చంద్రబాబుకు ఆ హక్కు లేదన్న వైసీపీ ఎమ్మెల్యే

ప్రజాచైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

news18-telugu
Updated: February 26, 2020, 12:25 PM IST
చంద్రబాబుకు ఆ హక్కు లేదన్న వైసీపీ ఎమ్మెల్యే
చంద్రబాబు
  • Share this:
రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. హంద్రీనీవాను కేవలం ఐదు టిఎంసిలకు పరిమితం చేసింది చంద్రబాబే అని ఆయన విమర్శించారు. హంద్రీనీవాకు చంద్రబాబు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లని విధంగా అనంతపురం జిల్లాకు హార్టికల్చర్ వచ్చిందంటే అది దివంగత సీఎం వైఎస్ చలవే అని అన్నారు. ప్రజాచైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మూడు సార్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించారు.

ap chief whip srikanth reddy, g srikanth reddy, ap chief whip, rayachoti, kadapa news, శ్రీకాంత్ రెడ్డి, ఏపీ చీఫ్ విప్, కడప, రాయచోటి
వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (File)


చంద్రబాబు అసైన్డ్ ల్యాండ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. 15 ఏళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు పేదలకు ఎప్పుడైనా భూమి పంపిణి చేశారా అని ప్రశ్నాంచారు. 15 ఏళ్లు గ్రాఫిక్స్‌తో చంద్రబాబు కాలం గడిపారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సీఎం జగన్‌పై టీడీపీ ఎన్ని వ్యాఖ్యలు చేసినా మౌనంగా భరిస్తున్నామని అన్నారు. చంద్రబాబు నీచసంస్కృతి మానుకుంటే మంచిదని సూచించారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ... దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మద్యపానం నిషేధం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు