వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గెలుపొందారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమె... ఎన్నికల్లో విజయం సాధించారు. నగరిలో రోజా గెలుపోటములపై జోరుగా బెట్టింగులు నడిచాయి. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా.. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుపై పోటీ చేసి గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో గాలి కుమారుడు భాను ప్రకాష్‌పై రోజా పోటీ చేసి మరోసారి విజయం సాధించారు.
2004లో నగరి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రోజా 2009లో ఓటమి తర్వాత వైఎస్ బతికి ఉండగానే కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. వైఎస్ మరణాంతరం వైసీపీలోకి వెళ్లడంతో పాటు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయడంతో జగన్ గత ఎన్నికల్లో ఆమెకు నగరి సీటు ఇచ్చారు. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో రోజా గెలుపొందడంతో ...ఆమెకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్లలో వైసీపీలో ఉంటూ టీడీపీపై పోరాటం చేసిన అనేకమంది నేతలు... జగన్ కేబినెట్లో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ జాబితాలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉందని...ఆమెకు జగన్ కేబినెట్లో తనకు కీలక శాఖ లభిస్తుందనే భావనతో ఉన్నారని కొద్దిరోజులుగా ప్రచారం కూడా సాగుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.