Roja: మళ్లీ రిపీటైతే... చంద్రబాబుకు రోజా వార్నింగ్

అమరావతి రైతులను మోసం చేసింది తాము కాదని రోజా అన్నారు. వారిని మోసం చేసిన చంద్రబాబు, అప్పటి మంత్రులను అడ్డుకోవాలని వారికి సూచించారు

news18-telugu
Updated: February 20, 2020, 2:29 PM IST
Roja: మళ్లీ రిపీటైతే... చంద్రబాబుకు రోజా వార్నింగ్
చంద్రబాబు, రోజా
  • Share this:
తనపై దాడికి యత్నించింది టీడీపీ గూండాలే అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇకనైనా ఇలాంటి కుళ్లు రాజకీయాలు మానుకోవాలని ఆమె హెచ్చరించారు. అమరావతి రైతులను మోసం చేసింది తాము కాదని రోజా అన్నారు. వారిని మోసం చేసిన చంద్రబాబు, అప్పటి మంత్రులను అడ్డుకోవాలని వారికి సూచించారు. టీడీపీ నేతలు మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై ఈ రకమైన చర్యలకు పాల్పడితే పరిణామాలకు తీవ్రంగా ఉంటాయని రోజా హెచ్చరించారు. చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రను అడ్డుకునే పరిస్థితులు వస్తాయని ఆమె వ్యాఖ్యానించారు.

అంతకుముందు నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో పాల్గొన్న రోజాను అడ్డుకునేందుకు కొందరు మహిళలు ప్రయత్నాంచరు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు, రైతుల ఆందోళనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న కొందరు మహిళా ఆందోళనకారులు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. పోలీసులు వారిని అడ్డగించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు