రోజా ఆసక్తికర వ్యాఖ్యలు... టీడీపీ ఎమ్మెల్యేతో అలా...

లాబీల్లో తనకు ఎదురుపడ్డ మరో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంను ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయని టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: June 18, 2019, 5:03 PM IST
రోజా ఆసక్తికర వ్యాఖ్యలు... టీడీపీ ఎమ్మెల్యేతో అలా...
రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
తనదైన వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకునే సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా... అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో తనను అసెంబ్లీలో ఇబ్బందికి గురి చేసిన టీడీపీ, ఆ పార్టీ అధినేతపై తనదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్న రోజా... తాజాగా అసెంబ్లీ లాబీల్లో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అసెంబ్లీ లాబీల్లో తనతో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన ఎమ్మెల్యే రోజా... అటు వైపుగా వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణను ఎలా ఉన్నారంటూ పలకరించారు. అందుకు ఆయన నవ్వుతూనే ఫైన్ అంటూ వెళ్లిపోయారు.

ఇంతవరకు బాగానే ఉన్నా... లాబీల్లో తనకు ఎదురుపడ్డ మరో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంను ఉద్దేశించి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయని టాక్ వినిపిస్తోంది. కరణం బలరాం రాకను గమనించిన ఎమ్మెల్యే రోజా... ఆయనను చూసి అన్నా మీరు మా వైపు వస్తారని ఆశించాం... కానీ అటు వైపు నుంచి వచ్చారు అని కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రోజా వ్యాఖ్యలకు స్పందించని కరణం బలరాం... నవ్వుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీపై అసంతృప్తితో ఉన్న కరణం బలరాం వైసీపీలోకి వస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికల తరువాత కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో... కరణం బలరాంను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Published by: Kishore Akkaladevi
First published: June 18, 2019, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading