జగన్ పుట్టినరోజున అదిరిపోయేలా విషెస్ చెప్పిన రోజా

జగన్‌తో కలిసి దిగిన అనేక ఫోటోల్ని ఆమె వీడియోద్వారా పోస్టు చేశారు.

news18-telugu
Updated: December 21, 2019, 11:13 AM IST
జగన్ పుట్టినరోజున అదిరిపోయేలా విషెస్ చెప్పిన రోజా
జగన్ పుట్టినరోజున అదిరిపోయేలా విషెస్ చెప్పిన రోజా
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తన 47వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటు పార్టీ శ్రేణులు కూడా తమ అభిమాన నాయకుడి బర్త్‌డే సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖులంతా సోషల్ మీడియా వేదిక జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తమ అభిమాన నాయకుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా జగన్ బర్త్‌డే సందర్భంగా మూడు నాలుగు ట్వీట్లు చేశారు. ‘ఆంధ్రరాష్ట్ర ముద్దుబిడ్డ 5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు అయిన మా వైఎస్ జగన్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..’ అంటూ జగన్‌తో కలిసి దిగిన అనేక ఫోటోల్ని ఆమె వీడియోద్వారా పోస్టు చేశారు. ’ హీ కేమ్, హీ సా... హీ కాంకర్డ్ అంటూ ఇంగ్లీష్ టెక్ట్స్ తో కూడిన మరో ట్వీట్‌ను కూడా రోజా ట్వీట్ చేశారు.



First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు