MLA Roja: చంద్రబాబు అలా చేయగలరా ? సవాల్ విసిరిన రోజా

Roja Comments on Chandrababu Naidu: పోలవరంను చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని రోజా గుర్తు చేశారు.

news18-telugu
Updated: September 19, 2020, 4:20 PM IST
MLA Roja: చంద్రబాబు అలా చేయగలరా ?  సవాల్ విసిరిన రోజా
రోజా, చంద్రబాబు
  • Share this:
అమరావతిలో భారీ కుంభకోణం జరగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాజధాని పేరుతో బాబు, ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో పెద్ద కుంభకోణం జరిగిందని.. ఈ కుంభకోణం మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తే గజగజ వణుకుతున్నారని రోజా విమర్శించారు. ఓ లాయర్ మీద కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం బాధాకరమని రోజా అన్నారు. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అన్ని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా ప్రధాని చెప్పారని రోజా అన్నారు.

పోలవరంను ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం తేలుకుట్టిన దొంగలా ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అక్రమాల మీద సీబీఐ విచారణ కోరాలని రోజా సవాల్ విసిరారు. అంతర్వేది ఘటనలో ప్రభుత్వం తప్పు లేకపోయినా సీఎం జగన్ సీబీఐ విచారణ కోరారని ఆమె గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడి మీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణకు ఆదేశించారని అన్నారు. అయితే చంద్రబాబు స్టేలతో బతుకుతున్న వ్యక్తి అని ఆరోపించారు.
Published by: Kishore Akkaladevi
First published: September 19, 2020, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading