Home /News /politics /

YSRCP MLA ROJA SHOCKING COMMENTS ON TDP CHIEF CHANDRABABU AND NARA LOKESH DURING KUPPAM MUNICIPAL ELECTION CAMPAIGN MKS TPT

చంద్రబాబుపై నారా లోకేశ్ ప్రతీకారం -కుప్పం ఎన్నికల సీన్ ఇదే -rk roja షాకింగ్ కామెంట్స్

చంద్రబాబు, లోకేశ్ పై రోజా కామెంట్స్

చంద్రబాబు, లోకేశ్ పై రోజా కామెంట్స్

మంగళగిరి అసెంబ్లీ స్థానంలో తనను దారునంగా ఓడించిన నాన్న(చంద్రబాబు)పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం లోకేశ్ కంకణం కట్టుకున్నాడని, కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని ఓడించడం ద్వారా లోకేశ్ తన తండ్రి చరిత్రకు సమాధి కట్టబోతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా షాకింగ్ కామెంట్లు చేశారు..

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో శనివారంతో ప్రచార పర్వం ముగిసింది. ఈనెల 15న (సోమవారం) నెల్లూరు కార్పొరేషన్ తోపాటు రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, పలు జిల్లాల్లో పరిషత్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే, అందరి ఫోకస్ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపైనే ఉంది. పరిషత్ ఎన్నికల్లో కుప్పం స్థానాలను కొల్లగొట్టిన వైసీపీ.. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకోడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నది. అటు టీడీపీ సైతం తన కంచుకోటను కాపాడుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కుప్పం పర్యటన సందర్భంగా సీఎం జగన్ పై అతి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. వాటిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా బదులిచ్చారు.

కుప్పంతోనే టీడీపీ ఖతం..
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, నారా లోకేశ్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఉందని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీని జనం తుంగలో తొక్కారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీని మురికి కాలువలో ముంచెత్తారని, ఇక పరిషత్ ఎన్నికల్లోనైతే టీడీపీని జనం తరిమి తరిమి కొట్టారని, ఆ దెబ్బలకు బయపడి అసలు ఎన్నికలంటేనే దూరంగా పారిపోయే స్థితికి టీడీపీ దిగజారిందని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలే టీడీపీ పతనానికి ఆఖరి చరణం కాబోతున్నదని, కుప్పం మున్సిపాలిటీలోనూ టీడీపీ పరాజయం తర్వాత చంద్రబాబుకు రాసుకోడానికి చరిత్ర, చూసుకోడానికి భవిష్యత్తు కూడా ఉండబోవని వైసీపీ రోజా జోస్యం చెప్పారు..

Kurnool : మర్మాంగాన్ని వారి చేతుల్లో పెట్టి.. చర్చిలోనే ప్రార్థన పేరుతో బాలికలపై పాస్టర్ పైశాచికం -షాకింగ్ ట్విస్ట్


చంద్రబాబుపై లోకేశ్ ప్రతీకారం
కుప్పం పర్యటన సందర్భంగా నారా లోకేశ్.. సీఎం జగన్ పై చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ ఆర్కే రోజా పదునైన విమర్శలు చేశారు. ‘లోకేశ్ మాటలు వింటోంటే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. కుప్పంలో ప్రచారానికి సీఎం జగన్ ఎందుకు రాలేదని లోకేశ్ ప్రశ్నిస్తోన్న తీరు, కుప్పానికి వైసీపీ సర్కారు ఏం చేసిందని అడుగుతోన్న వైనం ముమ్మాటికీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. మంగళగిరి అసెంబ్లీ స్థానంలో తనను దారునంగా ఓడించిన నాన్న(చంద్రబాబు)పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం లోకేశ్ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని ఓడించడం ద్వారా చంద్రబాబుపై లోకేశ్ ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాడు. అదే చేత్తో వాళ్ల నాన్న రాజకీయ భవిష్యత్తునూ సమాధి చేసే ప్రయత్నంలో లోకేశ్ ఉన్నట్లుగా ఆయన మాటలున్నాయి’అని రోజా వ్యాఖ్యానించారు.

Huzurabad : కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్ ఎందుకు ఆలస్యం? -AICC రివ్యూలో రచ్చరచ్చ


తుప్పు-పప్పులకు గుణపాఠం..
చంద్రబాబు దశాబ్దాలుగా కుప్పం నుంచి గెలుస్తున్నా ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని, కుప్పం ప్రజల సుఖ దుఃఖాల్లో టీడీపీ ఏనాడూ పాలుపంచుకోలేదని, చంద్రబాబు కుటుంబానికి కుప్పంలో కనీసం ఇల్లు కూడా లేకపోవడం అందుకొక నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన కుప్పాన్ని జగన్ తన సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తున్నారని, అన్ని అభివృద్ధి పనుల్లో కుప్పానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారని, వైసీపీకి ఓట్లు వేసినా, వేయకపోయినా కుల, మతాలకు అతీతంగా కుప్పంలోనూ జగన్ సర్కారు ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నదని, కాబట్టే కుప్పం ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని రోజా పిలుపునిచ్చారు. ఈ దెబ్బతో చంద్రబాబు అనే తుప్పుకి లొకేశ్ అనే పప్పుకి కుప్పం ప్రజలు గుణపాఠం చెప్పాలని రోజా కోరారు.
Published by:Madhu Kota
First published:

Tags: AP News, Chandrababu naidu, Kuppam, MLA Roja, Muncipal elections, Nara Lokesh, Rk roja, Tdp, Ysrcp

తదుపరి వార్తలు