దటీజ్ రోజా... వైసీపీ నేతలకు ఝలక్

చిత్తూరు జిల్లాలో జరిగిన అధికారిక సమావేశంలో మంత్రులకు ఊహించని షాక్ ఇచ్చారు రోజా.

news18-telugu
Updated: December 3, 2019, 6:58 PM IST
దటీజ్ రోజా... వైసీపీ నేతలకు ఝలక్
రోజా(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తన ప్రసంగంతో ఏపీ మంత్రులకు షాక్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన డీఆర్‌సీ సమావేశంలో పాల్గొన్న రోజా... ప్రొటోకాల్ హోదాలో వేదికపైనే కూర్చున్నారు. అయితే సమావేశంలో పాల్గొన్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలపై మంత్రులను నిలదీయడంతో... రోజా కూడా తన నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో ప్రశ్నించారు. తన నియోజకవర్గమైన నగరి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆమె సమావేశంలోనే ప్రసంగించారు.

నగరిలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని రోజా అన్నట్టు తెలుస్తోంది. దీంతో వేదికపై ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి అవాక్కయ్యారు. ప్రోటోకాల్ హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని సమావేశం అనంతరం వారిద్దరూ పరోక్షంగా రోజా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రోజా... సొంత పార్టీకి చెందిన మంత్రులకే ఊహించని షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>