పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరన్నారు. గతంలో పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు.

news18-telugu
Updated: September 15, 2019, 12:11 PM IST
పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా
రోజా పవన్ కళ్యాణ్
  • Share this:
జగన్ వందరోజుల పాలనపై తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా. వందరోజుల జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించామన్నారు. గత ఐదేళ్ల పాలనలోని అవకతవకలపై పవన్ ఎందుకు పుస్తకం విడుదల చేయలేదని జనసేనాని పవన్‌ను ప్రశ్నించారు రోజా. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరన్నారు. గతంలో పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో విమర్శలు చేయిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌లో ముద్రించిన పుస్తకాన్ని జనసేన పేరుతో పవన్ కల్యాణ్ విడుదల చేశారన్నారు రోజా. ప్యాకేజీలు తీసుకొని పవన్ ఇంకా చంద్రబాబుకే పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ వంద రోజుల పాలన ప్రణాళిక బద్ధంగా లేదన్నారు. సంవత్సరం వరకు జగన్ పాలనపై మాట్లాడే అవకాశం తనకు రాదనుకున్నానన్నారు. కానీ మూడునెలల్లోపే వైసీపీ పాలనపై మాట్లాడే అవకాశం కల్పించారన్నారు. రెండు వారల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయన్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు చూస్తుంటే... పారదర్శకత లోపించిందన్నారు. జనరంజకమైన జనవిరుద్ధ పాలనగా వైసీపీ పాలనను అభవర్ణించవచ్చన్నారు జనసేనాని. నవరత్నాలు జనరంజకమైనవే ఆయన.. వాటిని జనవిరుద్ధంగా అమలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 15, 2019, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading