నగరి వార్డు వాక్‌ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా

నగరిలో 10వ వార్డులో వార్డు వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వార్డు సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 8:26 AM IST
నగరి వార్డు వాక్‌ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా
నగరిలో రోజా పర్యటన
  • Share this:
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించారు వైసీీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. నగరిలో 10వ వార్డులో వార్డు వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వార్డు సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పలువురు రోజాకు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రోజా. అనంతరం నగిరి మున్సిపాలిటీ పదో వార్డు నందు అంచనా విలువ నాలుగు లక్షలు కలిగిన సిమెంటు రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఇప్పటికే నగరిలో నో ప్లాస్టిక్ నినాదంతో దూసుకుపోతున్న రోజా.. ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకొచ్చేవారికి కిలో బియ్యం ఆఫర్ ప్రకటించారు. నిండ్ర మండలం కొప్పేడు నందు ప్లాస్టిక్ వాడకం నివారణకై ర్యాలీగా వచ్చి అవగాహన కల్పించడానికై ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు తెచ్చిన వారికి ఒక కిలో బియ్యం అందించారు. నిండ్ర మండలం అగరం పేట గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు జయంతి కుటుంబ సభ్యులను రోజా పరామర్శించారు. వైస్సార్ రైతు భీమా ద్వారా 7 లక్షల రూపాయల చెక్కును నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్మన్ రోజా అందించారు.First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>