జగన్‌ను జూనియర్ ఎన్టీఆర్‌తో పోల్చిన రోజా.. డైలాగ్ దించేసిందిగా..

Roja Speech | సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి టార్చ్ బేరర్ లాంటివాడని, నవ్యాంధ్రను నవశకం వైపు నడిపించే నాయకుడు ఆయనేనని రోజా అన్నారు.

news18-telugu
Updated: June 17, 2019, 10:45 PM IST
జగన్‌ను జూనియర్ ఎన్టీఆర్‌తో పోల్చిన రోజా.. డైలాగ్ దించేసిందిగా..
ఏపీ అసెంబ్లీలో రోజా
news18-telugu
Updated: June 17, 2019, 10:45 PM IST
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి.. సినిమా డైలాగ్స్‌ను అచ్చుగుద్దినట్టు దించేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రోజా మాట్లాడారు. ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద్ సమేత సినిమాలో డైలాగ్‌ను అలాగే దించేశారు. ఆ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు. ‘ప్రతి 30 ఏళ్లకీ బ్రతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. వ్యాపారులు ఫ్యాషన్ అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త ఆలోచనను ముందుకు తీసుకెళ్లేవాడు ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు.’ అనే డైలాగ్ ఉంది. రోజా తన ప్రసంగం ప్రారంభంలో ఈ డైలాగ్ సేమ్ టు సేమ్ వాడేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి టార్చ్ బేరర్ లాంటివాడని, నవ్యాంధ్రను నవశకం వైపు నడిపించే నాయకుడు ఆయనేనని రోజా అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం గతి మారబోతోందనే విషయం.. జగన్ మోహన్ రెడ్డి 15 రోజుల పాలనలోనే తెలిసిపోయిందని రోజా అన్నారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...