ఏపీ అసెంబ్లీలో విజయశాంతి డైలాగ్ దించేసిన ఎమ్మెల్యే రోజా... సరిలేరు నీకెవ్వరు సినిమాలోదే...

సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి చెప్పిిన ఓ డైలాగ్‌ను ఏపీ అసెంబ్లీలో రోజా తన ప్రసంగంలో వినియోగించుకున్నారు. తత

news18-telugu
Updated: January 27, 2020, 4:47 PM IST
ఏపీ అసెంబ్లీలో విజయశాంతి డైలాగ్ దించేసిన ఎమ్మెల్యే రోజా... సరిలేరు నీకెవ్వరు సినిమాలోదే...
విజయశాంతి, రోజా
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో డైలాగ్‌ను వాడుకున్నారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కేరోజా సెల్వమణి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా రోజా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి చెప్పిన డైలాగ్‌ను వాడుకున్నారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన బిల్లులను చూసిి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాల తమ ఆశలు, ఆశయాలను నెరవేర్చే నాయకుడు వచ్చాడని సంతోషిిస్తున్నారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయగలడు (ఈ డైలాగ్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి మహేష్ బాబు గురించి చెబుతుంది.) అని ప్రజలు అంటున్నారు. 3648 కి.మీ పాదయాత్రలో జగన్ తనకు అయిన గాయాలు మర్చిపోయి ప్రజల గాయాలు తెలుసుకుని వాటికి చికిత్స చేస్తున్నారు.’ అని రోజా అన్నారు.

ప్రజలు ఎన్నుకొన్న 151 మంది ఎమ్మెల్యేలు ఆమోదించి పంపిన బిల్లులను శాసనమండలిలో అవమానిస్తూపోతే అలాంటి కౌన్సిల్ అవసరం ఏముందని రోజా ప్రశ్నించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు లాంటి రాజకీయ క్రిమినల్ ఎంతవరకైనా దిగజారతారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి రద్దవడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, ఒకవేళ రద్దయినా తాను మళ్లీ తీసుకొస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని రోజా మండిపడ్డారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడేదేదో వచ్చి శాసనసభలో మాట్లాడొచ్చు కదా అని ప్రశ్నించారు. సభకు ఎందుకు డుమ్మా కొట్టారని టీడీపీని నిలదీశారు.

పెద్దల సభ అంటే సీనియర్ రాజకీయ నేతలను పంపుతారని, కానీ చంద్రబాబు మాత్రం ఓ దద్దమ్మ, దద్దోజనాన్ని (నారా లోకేష్‌ను ఉద్దేశించి) పంపారని మండిపడ్డారు. ‘దమ్ముంటే శాసనమండలిని రద్దు చేయాలని దద్దోజనం అంటున్నారు. ఆ లోకేష్‌కు చెబుతున్నా. డిక్కి బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడగొడితే కోసి కారం పెట్టి కూరయిపోతుంది.’ అని రోజా హెచ్చరించారు. శాసనమండలిని రద్దు చేయాలన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాను సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు