అన్నమాట ప్రకారం... పుట్టినరోజే కొత్త పని ప్రారంభించిన రోజా

ఓ సెలబ్రిటీగా, ఎమ్మెల్యేగా ఇలాంటి కార్యక్రమాలు నేను చేపడితే ప్రజల్లో తప్పకుండా అవగాహన వస్తుందని భావిస్తున్నాన్నారు రోజా.

news18-telugu
Updated: November 17, 2019, 2:40 PM IST
అన్నమాట ప్రకారం... పుట్టినరోజే కొత్త పని ప్రారంభించిన రోజా
రోజా(ఫైల్ ఫోటో)
  • Share this:
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి అన్నమాట ప్రకారమే ప్లాస్టిక్ బ్యాన్‌కు నడుం బిగించారు. తన నియోజకవర్గంలో  ప్లాస్టిక్ నిర్మూలనకు ‘న్యూ నగరి-నో ప్లాస్టిక్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్‌ను తీసుకొస్తున్న వారికి అంతే బరువుగాల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చారు. ప్లాస్టిక్ నిషేధంపై మనం మాటల్లో చెబితే ఎవరూ వినరన్నారు రోజా. అందుకే ఇలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఓ సెలబ్రిటీగా, ఎమ్మెల్యేగా ఇలాంటి కార్యక్రమాలు నేను చేపడితే ప్రజల్లో తప్పకుండా అవగాహన వస్తుందని భావిస్తున్నాన్నారు.

పేదవాళ్లు తప్పకుండా తమ ఇంటి చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఏరి తీసుకువస్తారన్నారు. న్యూ నగరి నో ప్లాస్టిక్ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలపారు. జనానికి కథనాల రూపంలో అర్థమయ్యేలాగా చెబితే మరింత అవగాహన వస్తుందన్నారు. ఒకరి నుంచి ఒకరు ఇన్ స్పైర్ అవుతారన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారిందరికీ బియ్యంను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతీ ఏడాది పుట్టినరోజుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు.
First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading