లోకేష్‌కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధ... వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు...

‘ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల మానప్రాణాల భద్రత అన్న విషయంపై చంద్రబాబుకు బాధ లేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి’ అని రోజా అరోపించారు.

news18-telugu
Updated: December 9, 2019, 8:42 PM IST
లోకేష్‌కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధ... వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు...
మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ ఓడిపోయారు. సొంత కొడుకు లోకేష్‌ను కూడా ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారనే విమర్శను చంద్రబాబు మూటగట్టుకున్నారు.
  • Share this:
లోకేష్‌కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మహిళల భద్రతపై చర్చిస్తుంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ చేస్తుందని, మహిళల పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. దిశ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయని, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, లోకేష్‌ ఫోటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. మహిళా భద్రత అంశంపై ఆమె మాట్లాడారు. ‘చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ తినే పప్పులో ఉల్లిపాయ లేదని బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల మానప్రాణాల భద్రత అన్న విషయంపై చంద్రబాబుకు బాధ లేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయనకు తెలియదు. మహిళల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అలాగే ఉల్లిపాయల గురించి కూడా చర్చించేందుకు సమయం కేటాయిస్తామని సీఎం చెప్పారు. కానీ, ఆడవాళ్ల భద్రత గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. దిశ సంఘటన తరువాత ఆడవాళ్లు కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అంతకుముందు రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ, స్వప్నిక, ప్రతిణ, రేపు ఎవరు అని ఆడవాళ్లు భయపడుతున్నారు. దిశను అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష వెంటనే పడాలని దేశంలోని అందరూ కోరారు. నడిరోడ్డుపై శిక్షించాలని మాట్లాడారు. ఆ నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేస్తే మహిళలు సంబరాలు చేసుకున్నారు.’ అని రోజా అన్నారు.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>