Roja Selvamani Latest News | నగరి నియోజకవర్గం విజయపురం మండలంలో వైసీపీ నాయకులు భూకబ్జా పేరుతో వెలువడిన కథనం మీద స్థానిక ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. కుప్పం నుంచి వైజాగ్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరుపేదల భూములను ఎలా దోచుకుని వేధించారు, ఇబ్బంది పెట్టారనే విషయం అందరికీ తెలుసున్నారు. అలాంటి వారు స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఎదిరించే సత్తా లేక కొన్ని పేపర్లలో హెడ్ లైన్ లో పెట్టి, పేజీలు పేజీలు కథనాలు రాసి వైసీపీ నాయకులు మీద, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే ఈ విషయంపై న్యాయవాదులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారి నేతృత్వంలోని విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 2014 నుంచి ఈరోజు వరకు ఏదైతే ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములుగా మార్చారో లేదా కబ్జా చేశారో వచ్చే సోమ, మంగళవారం లోపు సమగ్ర విచారణ చేపట్టి కలెక్టర్కు రిపోర్ట్ చేస్తామన్నారు. వాటిలో ప్రభుత్వ భూములు ఉంటే దాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటామని, కబ్జా చేసిన వారు ఎవరైనా కూడా చర్యలు తప్పవని తెలిపారు.
దీని వెనక ఒక బీజేపీ పార్టీ మాత్రమే కాకుండా ఇతరుల హస్తం కూడా ఉందని బురదజల్లే ప్రయత్నాలు ఎవరు చేసినా సహించబోమని హెచ్చరించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 26, 2020, 19:03 IST