బాలకృష్ణకు రోజా సెటైర్... ఆ సైగ ఏదో అప్పుడే చేసుంటే...

లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని... మండలి రద్దుతో లోకేశ్ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని రోజా ఆరోపించారు.

news18-telugu
Updated: February 4, 2020, 11:35 AM IST
బాలకృష్ణకు రోజా సెటైర్... ఆ సైగ ఏదో అప్పుడే చేసుంటే...
బాలకృష్ణ, రోజా
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా టీడీపీ ఎమ్మెల్యే సినీనటుడు బాలకృష్ణకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ అప్పుడే సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని రోజా వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుందని ఆమె అన్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై కూడా రోజా తీవ్ర విమర్ళలు చేస్తున్నారు. పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మను తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారని... వారు ఉన్నా లేకున్నా ఒకటే అని రోజా ఎద్దేవా చేశారు.

లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని... మండలి రద్దుతో లోకేశ్ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని రోజా ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌పై కూడా రోజా విమర్శలు గుప్పించారు. చీకటి జీవోలు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మూడు రాజధానులకు అనుగుణంగానే సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని రోజా స్పష్టం చేశారు.
First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు