వైసీపీ ఎమ్మెల్యే రోజా మాజీ మంత్రి యనమలపై సెటైర్లు వేశారు. నిన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజా.. ఇవాళ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును టార్గటె్ చేశారు. రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని వెటకారిస్తూ... ఓ ట్వీట్ చేశారు. విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారన్న యనమల వ్యాఖ్యలకు జవాబు ఇస్తూ... ‘పుచ్చిపోయిన పొన్నుకి సింగపూర్ వెళ్ళమని ఎవరు చెప్పారని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
శుక్రవారం ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్న తండ్రి ఎన్టీఆర్కే అన్నం పెట్టలేని భువనేశ్వరి.. తన గాజులు తాకట్టు పెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ సెటైర్ వేశారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్కు పట్టించుకోలేదని విమర్శించారు. అటు.. ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా భువనేశ్వరిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో పప్పుబెల్లాల మాదిరిగా చవగ్గా కొట్టేసిన భూములు ఆమె తీవ్రంగా విమర్శించారు.
విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారు - యనమల.
పుచ్చిపోయిన పొన్నుకి సింగపూర్ వెళ్ళమని ఎవరు చెప్పారు - ప్రజలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.