YSRCP MLA ROJA REACTION ON PRIYANKA REDDY MURDER CASE SB
షాద్‌నగర్ హత్యపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆవేదన
రోజా (File Photo)
అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రియాంకరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు రోజా.
హైదరాబాద్‌లో జరిగిన ప్రియాంక రెడ్డి హత్యచార కేసు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రాజకీయ నేతల నుంచి సినీ ప్రముఖులు వరకు అంతా స్పందిస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ప్రియాంక మర్డర్ కేసుపై స్పందించారు. నిందితుల్ని కఠినంగా శిక్షాంచాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ప్రియాంక రెడ్డి హత్య కేసు తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రియాంకరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు రోజా.
హైదరాబాద్ నగర శివారులో జరిగిన డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య నన్ను తీవ్రంగా కలచివేసింది. అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. ప్రియాంకరెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
మరోవైపు ప్రియాంక హత్యకేసు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ 1. మహమ్మద్ అలియాస్ ఆరిఫ్-లారీ డ్రైవర్ ( 26), ఏ2. జొల్లు శివ- లారీ క్లీనర్ (20), ఏ3. జొల్లు నవీన్ -లారీ క్లీనర్ (20), ఏ4. చెన్నకేశవులు-లారీ డ్రైవర్ (20)పై చార్జిషీట్ దాఖలు చేశామని సైబారాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. వీరంతా నారాయణపేట జిల్లా మక్తల్ మండలానికి చెందిన వారని తెలిపారు. లారీలపై పని చేసే ఈ నలుగురూ పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియాంక రెడ్డి ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని.. అనంతరం దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. ఇవాళ నిందితుల్ని కోర్టు ముందు ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు.ఇప్పటికే వారిని అరెస్ట్ చేసి వైద్య చికత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.