ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై రోజా రియాక్షన్ ఏంటో తెలుసా ?

రోజా

పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. కేంద్రం అంశాన్ని పక్కన పెడితే.. ఏపీలో మాత్రం పలు సర్వేలు టీడీపీకి అనుకూలంగా వస్తే.. మరికొన్ని వైసీపీకి అనుకూలంగా వచ్చాయి.

  • Share this:
    2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏడు దశల్లో జరిగింది. ఆదివారం ఏడో దశ ఓటింగ్ ముగియగానే... పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. కేంద్రం అంశాన్ని పక్కన పెడితే.. ఏపీలో మాత్రం పలు సర్వేలు టీడీపీకి అనుకూలంగా వస్తే.. మరికొన్ని వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఎవరూ కూడా స్పష్టంగా ఏ పార్టీ మెజార్టీ విజయం సాధిస్తుందనేది తేల్చలేకపోయాయి. దీంతో బయటకు చెప్పలేకపోతున్నా ఇరు పార్టీల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. తన వరకు అయితే ఇలాంటి సర్వేలను నమ్మనని తేల్చేశారు. ఏపీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు రోజా. ప్రజలతో మమేకమై వారు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నామని అన్నారు. దేశంలో ఏ నాయకుడు ఇంత వరకూ చేయని విధంగా జగన్ పాదయాత్ర చేశారన్నారు. ప్రజలను కలిసి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారని చెప్పారు. జగన్ పై ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వారి కళ్లలో చూశామన్నారు రోజ, కచ్చితంగా, జగన్ ఏపీ సీఎం కాబోతున్నారని గంటాపథంగా చెబుతున్నానని అన్నారు.

    ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచవని ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత అని చంద్రబాబును గెలిపిస్తే ఆయన ప్రజలకు ఏం చేయలేకపోయారని విమర్శించారు. అందుకే ప్రజలు ఇప్పుడు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. రోజా నగరి నియోజకవర్గం నుంచి ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో కూడా రోజా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుపై గెలుపొందారు. ఈసారి ఎన్నికల బరిలో గాలి కుమారుడుపై రోజా పోటీ చేస్తున్నారు.
    First published: