గన్ వచ్చేలోగా జగన్ వస్తాడు... మళ్లీ పొగిడేసిన రోజా

మహిళల భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. జై జగన్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు రోజా.

news18-telugu
Updated: December 9, 2019, 1:15 PM IST
గన్ వచ్చేలోగా జగన్ వస్తాడు... మళ్లీ పొగిడేసిన రోజా
ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్
  • Share this:
ఏపీ అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి జగన్‌పై పొగడ్తల వర్షం కురపించారు. దిశ హత్యాచార ఘటనతో పాటు... మహిళల భద్రతపై కూడా సభలో చర్చించారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలు, హొంమంత్రి సుచరిత మహిళల భద్రత పట్ల మాట్లాడారు. రోజా కూడా దీనిపై స్పందిస్తూ... జగన్ పై పొగడ్తల వర్షం కురపించారు.  జగన్ మనసున్న మారాజు... అన్నారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే... గన్ వచ్చేలోగా జగన్ వస్తాడన్న ధైర్యం కలిగించానల్నారు. అందుకే ఏపీలో ప్రతీ ఆడపడుచు జగన్‌ను ముఖ్యమంత్రి అని కాకుండ అన్నా అనిపిలుస్తారన్నారు.జగన్‌ అన్నకు కూడా ఇద్దరు ఆడపిల్లలున్నారన్నారు. జగన్ తన తల్లిని, చెల్లిని, కూతుళ్లను అందర్నీ గౌరవిస్తారన్నారు. అందుక జగన్ అన్న సభ సాక్షిగా మహిళల భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. జై జగన్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు రోజా.

 

 

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>