కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

KCR Birthday: మరోవైపు కేసీఆర్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: February 17, 2020, 4:44 PM IST
కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా
కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.... ఏపీఐఐసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇవాళ సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్ కళకళలాడుతోంది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్ లో కేసీఆర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ కమిషన్లు, అకాడమీల చైర్మన్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రోజా


మరోవైపు కేసీఆర్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో , సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు