హోమ్ /వార్తలు /politics /

MLA Roja: 'సింహంతో వేట.. జగన్ తో ఆట ఈజీ కాదు..' చంద్రబాబు, లోకేష్ పై రోజా పంచ్ ల వర్షం.. అచ్చెన్నకు మూడు ఆప్షన్లు...!

MLA Roja: 'సింహంతో వేట.. జగన్ తో ఆట ఈజీ కాదు..' చంద్రబాబు, లోకేష్ పై రోజా పంచ్ ల వర్షం.. అచ్చెన్నకు మూడు ఆప్షన్లు...!

చంద్రబాబుపై రోజా కామెంట్స్..

చంద్రబాబుపై రోజా కామెంట్స్..

వైఎస్ఆర్సీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) అసెంబ్లీలో (AP Assembly) పంచ్ ల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu), ఆయన కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) కు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు.

ఇంకా చదవండి ...

వైఎస్ఆర్సీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) అసెంబ్లీలో (AP Assembly) పంచ్ ల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu), ఆయన కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) కు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళా సాధికారతపై చర్చలో పాల్గొన్న రోజా... సీఎం వైఎస్ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతూనే.. ప్రతిపక్షంపై తనదైన శైలిలో పంచ్ లు విసిరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉందని.. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయనన్ని పథకాలను అక్కచెల్లెళ్ల కోసం సీఎం జగన్ అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా 33లక్షల ఇళ్లను మహిళల పేరుతోనే ఇచ్చారని రోజా చెప్పారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలను చూసే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మహిళలు వైసీపీకి పట్టం కడుతున్నారని ఆమె అన్నారు.

తన ప్రసంగంలో చంద్రబాబు, లోకేష్ పై ధ్వజమెత్తారు రోజా. వారిపై కౌంటర్లు, సైటర్లతో అదరగొట్టారామె. 14 ఏళ్లుగా రాష్ట్రానికి సీఎంగా చేసిన చంద్రబాబు ఏనాడూ మహిళలను పట్టించుకోలేదని.. సీఎం జగన్ మాత్రం రెండేళ్లలోనే మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉన్నారన్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమికొట్టారని.. ఇకపై అక్కడ బాబు పప్పులుడకవని ఎద్దేవా చేశారు. కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా కాదని.. ఐస్ గడ్డ మాదిరిగా కరిగిపోతోందంటని రోజా సెటైర్ వేశారు. ఢిల్లీలో చక్రం తిప్పానన్న చంద్రబాబు గల్లీలో ప్రచారం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. సింహంతో ఆట.. వైఎస్ జగన్ తో ఆట అంత ఈజీ కాదంటూ టీడీపీకి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు.

ఇది చదవండి: వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. సునీతపై శంకర్ రెడ్డి సంచలన ఆరోపణలు...



ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్ లో మార్పు రాలేదన్న రోజా.. ఎన్ని సవాళ్లు విసిరినా జగన్ ను ఏమీ చేయలేరని విమర్శించారు. జగన్ తో పోటీ పడాలని లావు తగ్గిన లోకేష్ కు కొవ్వు మాత్రమే తీశారా..? లేక మరేదైనా తీశారా..? అని... ఈ మధ్య పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు.

ఇది చదవండి: చంద్రబాబు స్వయంకృతమా..? పెద్దిరెడ్డి రాజకీయమా..? కుప్పంపై ఎవరిలెక్కలు వారివి..!



అచ్చెన్నాయుడు వేసే చిటికెలకు ఎవరూ భయపడరని ఆమె అన్నారు. అచ్చెన్నకూ మూడు ఆప్షన్లు ఇస్తున్నాని.. అందులో దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. అచ్చెన్నకు దమ్ముంటే టెక్కలిలో రాజీనామా చేసి గెలవాలని.. లేదా అచ్చెన్నతో పాటు రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేసిన గెలవాలన్నారు. ఇక మూడో ఆప్షన్ గా కుప్పంలో చంద్రబాబు కాకుండా లోకేష్ తో పోటీ చేయించి గెలవావలని ఛాలెంజ్ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Chandrababu Naidu, MLA Roja, Nara Lokesh

ఉత్తమ కథలు