ఎంత అందంగా ఉంది... పరవశంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఎంత అందంగా ఉంది అంటూ అక్కడ ప్రకృతిని చూసి పరవశించి పోతున్నారు.

news18-telugu
Updated: September 7, 2019, 2:30 PM IST
ఎంత అందంగా ఉంది... పరవశంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజా
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆమె ఆనందంగా గడుపుతున్నారు. తాజాగా అక్కడున్న చల్లని వాతావరణానికి సంబంధించిన వీడియోను తన అభిమానులకు షేర్ చేశారు రోజా. ఈ వీడియోలో రోజా కారులో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఎంత అందంగా ఉంది అంటూ అక్కడ ప్రకృతిని చూసి పరవశించి పోతున్నారు. ఎంత దూరం ప్రయాణిస్తుంటే.. అంతటా పచ్చగా అందంగా కనిపిస్తుందన్నారు. అప్పుడే ఎండ... అప్పుడే వర్షం అంటూ.. ఆమె ఆస్ట్రేలియాలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.అక్కడి చల్లటి వాతావరణాంలో ఆనందంగా సేద తీరుతున్నారు.

గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలో భర్త, పిల్లలతో కలిసి రోజా పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫోటోలను ఫ్యామిలీ టైమ్ అంటూ సోషల్ మీడియాలో కూడా ఆమె షేర్ చేశారు. ఎన్‌ఐఆర్‌లు, తెలుగు వాళ్లతో కలిసి రోజా ఫోటోలు దిగారు. రెస్టారెంట్‌లో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె హాజరయ్యారు.కాన్‌బెర్రాలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్‌తో రోజా సమావేశం అయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆమె.. అక్కడ ఇండియన్ హై కమిషనర్ డాక్టర్ ఏఎం గొండనేతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీఐఐసీ ఎలాంటి చర్యలు చేపడుతోంది? రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు, పథకాలను భారత హైకమిషనర్‌కు వివరించారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాలను డాక్టర్ ఏఎం గొండనే అభినందించారని రోజా తెలిపారు.అంతకుముందు వైఎస్ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు.


First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>