మనుషులు తిరిగే చోటులో ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరిగితే ఇక ఆడపిల్లకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా. ఇలాంటి కేసుల విషయంలో జడ్జీలు నడిరోడ్డుపై నేరస్థుల్ని ఉరితీసే విధంగా జడ్జ్మెంట్లు ఇవ్వాలన్నారు. అభం శుభం తెలియని అమ్మాయిని అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మానవ మృగాల్ని బహిరంగంగానే ఉరితీయాలని డిమాండ్ చేశారు రోజా. ఇలాంటి శిక్షలతో ఆడపిల్లలపై చేయి వేయాలంటేనే.. భయం రావాలన్నారు. మానవ హక్కుల సంఘాలు కూడా నేరస్థుల్ని శిక్షించే విధంగా ఫైట్ చేయాలన్నారు. ప్రియాంక రెడ్డి హత్య కేసు చూసి ఆడపిల్లను ఎందుకు కన్నానో అని భయం వేసిందన్నారు. పెళ్లి చేసి తమ బిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టాలన్న కూడా భయంగా ఉందన్నారు. రోడ్డుమీద వెళ్తే కూడా ఆడపిల్లకు ఎక్కడ ఏ ఆపద వస్తుందోనన్న ఆందోళన కల్గుతుందున్నారు. నేనేకాదు ఆడపిల్లను కనాలంటేనే ప్రతీ ఒకరు భయపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు రోజా.
ఏపీలో సీఎం జగన్ మహిళల రక్షణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆరేళ్లనుంచి చిన్నారి నుంచి అరవైఏళ్ల ముసలావిడ వరకు ప్రతీ మహిళ ధైర్యంగా బతికే రోజులు జగన్ కల్పిస్తున్నారన్నారు.జగన్ పరిపాలనలో మంచి రోజులు వస్తాయన్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.