టీడీపీపై రోజా రివర్స్ ఎటాక్... ఏమన్నారంటే...

చంద్రబాబు, టీడీపీ నేతలు బురదచల్లాలని చూసినా తాను భయపడనని రోజా వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: April 21, 2020, 8:44 PM IST
టీడీపీపై రోజా రివర్స్ ఎటాక్... ఏమన్నారంటే...
వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja)
  • Share this:
చంద్రబాబు, టీడీపీ నేతలు తిన్నది అరక్క సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. పేదలకు సహాయం చేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు బురదచల్లాలని చూసినా తాను భయపడనని ఆమె వ్యాఖ్యానించారు. 5 ఏళ్లు టీడీపీ పాలనలో పుత్తూరులో తాగునీరివ్వలేదని... సీఎం జగన్ సీఎం అయ్యాక మంచినీరిచ్చామని రోజా అన్నారు. ఆ రోజు మహిళలు ఆనందం వ్యక్తం చేశారని... దానిని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. అయినా తాను రాజీపడబోనని... సీఎం జగన్ స్ఫూర్తిగా పేదలకు అండగా ఉంటున్నానని రోజా అన్నారు. టీడీపీ నేతలు బాగా సంపాదించి ఇంట్లో కూర్చుంటున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబు సలహాలు అవసరంలేదని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు ముందు ఆయన కొడుక్కి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఇంట్లో కూర్చుని బాగా తిని సైక్లింగ్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా టెస్టులలో కానీ, రేషన్ పంపిణీలో కానీ సీఎం జగన్ ని అందరూ అభినందిస్తున్నారని... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అభినందించారని ఆమె గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎమ్మెల్యే రోజా ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్య నగర్‌లో ఓ బోరు బావి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కరోనా లాక్‌డౌన్ వేళ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సింది పోయి..ఏకంగా హంగు హార్భాటాలతో నిర్వహించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 
First published: April 21, 2020, 7:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading